ఎట్టకేలకు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ మైక్రోబస్ లేదా మల్టీ పర్పస్ వెహికిల్ VW ID. BUZZను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ఐకానిక్ VW బస్ సరికొత్తగా ఎలక్ట్రిక్ అవతార్‌లో కన్పించనుంది. ఈ ఏడాది చివర్లో యూరప్ మార్కెట్లలోకి వీడబ్య్లూ ఐడీ.బజ్ అందుబాటులోకి రానుంది.
సరికొత్త హాంగులతో..!
మల్టీ పర్పస్ వెహికిల్ విభాగంలో ఫోక్స్ వ్యాగన్ VW ID. BUZZ భారీ ఆదరణను పొందింది. పలు కారణాలతో ఫోక్స్‌వ్యాగన్ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రసుత్తం VW ID. BUZZ వ్యాన్ సరికొత్తగా ఎలక్ట్రిక్ రూపంలో రానుంది.
ఈ వాహనం బజ్ గ్రూప్‌కు చెందిన మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ కిట్ (MEB) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడనుంది. ఇది యూరప్‌లోని మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ బస్, ట్రాన్స్‌పోర్టర్. ఈ కారు కార్గో, ప్యాసింజర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
ఇంజన్ విషయానికి వస్తే..!
ఫోక్స్‌వ్యాగన్ ID. Buzz 150 kW లేదా 201 bhp ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. 1 kW ఏసీ వాల్ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు, అయితే, ఇది 170 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇవ్వనుంది. ఈ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ రేంజ్‌ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
రెట్రో లుక్స్‌తో, మరింత స్టైలిష్‌గా..!
సరికొత్త ID. Buzz 1950 VW బస్ T1 మోడల్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఈవీ షార్ట్ ఫ్రంట్ ఓవర్‌హాంగ్‌లతో రానుంది. ఐకానిక్ ఫ్రంట్ దాని మధ్య V-ఆకారపు ఫ్రంట్ ప్యానెల్‌తో పాటు ఆధునిక ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లతో వస్తుంది. బంపర్ ప్రత్యేకమైన డైమండ్ ప్యాటర్న్ గ్రిల్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ వాహనంలో సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ , అన్ని ఇతర ఆధునిక అంశాలతో రానుంది.
చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్‌లో చవకైన బైక్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment