న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు జోరందుకోవడంతో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు ఈవీ మార్కెట్లు పోటీ పడుతున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ రేసులోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ స్కోడా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. స్కోడా ఆటో గ్లోబల్ చైర్మన్ థామస్ షాఫెర్ మాట్లాడుతూ.. భారత్, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. దేశం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు కీలక మార్కెట్ గా ఉంటుందని తెలిపారు.
స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా ఈ దశాబ్దం చివరి నాటికి మొత్తం ఉత్పత్తిలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయ అవసరాలకు తగ్గట్టు కార్లను తయారు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. సరసమైన ధరలకు కార్లను తీసుకొనిరావాడానికి స్థానికీకరణ చాలా కీలకమని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, హ్యుందాయ్, కియా కంపెనీలకు పోటీగా తీసుకొని రానున్నట్లు తెలిపారు. అవసరం అయితే, పెట్టుబడులను భారీగా పెంచాలని చూస్తున్నట్లు వివరించారు.
(చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ నువ్వు ఏం చేస్తున్నావ్? ఫేస్‌బుక్‌పై ఫైర్!)
Comments
Please login to add a commentAdd a comment