సాక్షి, ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారతీయ వినియోగదారులకు షాకిచ్చింది. భారత మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. అన్ని రకాల మోడళ్లపై దాదాపు 2శాతం వరకు ధరలు పెంచు తున్నట్టు ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది.
అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగాధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. వర్టస్, టైగన్ ,కొత్త టిగువాన్ మొదలు భారతదేశంలోని ఫోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా ధరల పెంపు అమల్లో ఉంటుందని పేర్కొంది.
కొత్త ధరల జాబితాను వెల్లడించనప్పటికీ, కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో 2శాతం వరకు వరకు పెంపు ఉంటుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ. 11.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.92 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఇక టైగన్ ఎస్‌యూవీ ప్రస్తుతం రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్న ధర పెంపు తర్వాత రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment