జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ షాకిచ్చింది. ఇండియాలో ఆ కంపెనీ అందిస్తున్న కార్ల ధరలను సైలెంట్‌గా పెంచేసింది. ఇన్‌పుట్ కాంపోనెంట్స్ పేరుతో ఫోక్స్ వ్యాగన్ ఈ భారం మోపింది.
ఫోక్స్ వ్యాగన్ కార్లకు దేశవ్యాప్తంగా సెపరేట్ కస్టమర్ బేస్ ఉంది. మార్కెట్ లీడర్‌గా ఇక్కడ ఎదగపోయినా మంచి అమ్మకాలే సాధిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి ఇండియాలో పోలో, వెంటో మోడల్స్ ఇప్పటికే రోడ్లపై పరుగులు తీస్తుండగా ఇటీవల కాంపాక్ట్ ఎస్‌యూవీగా మార్కెట్‌లోకి టైగన్ మోడల్‌ని తీసుకువచ్చింది. కాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూడు మోడళ్లపై ధరలను పెంచేసింది.
ఫోక్స్‌వ్యాగన్ తాజాగా పెంచిన ధరలు నవంబరు 15 నుంచి అమల్లోకి వచ్చాయి. టైగన్ మోడల్‌లో ఉన్న అన్ని వేరియంట్లపై రూ. 4200ల వరకు ధరను పెంచేసింది. ప్రస్తుతం టైగన్ ధర రూ.10.54 లక్షల నుంచి రూ. 17.54 లక్షల వరకు ఉంది. ఇక వెంటో, పోలో మోడల్స్‌పై అయితే ఏకంగా రూ. 5000 ధరను పెంచింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో పోలో ధర రూ.6.32 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండగా వెంటో ధర రూ. 10 లక్షల నుంచి 14.15 లక్షల దగ్గర ఉంది.
ఫోక్స్‌వ్యాగన్‌కే చెందిన సబ్సిడరీ కంపెనీ స్కోడా కంపెనీ సైతం కుషాక్ ధరని గుట్టు చప్పుడు కాకుండా పెంచేసింది. ఎక్స్‌షోరూంలో కుషాక్ ప్రారంభ ధర రూ.10.79 లక్షల నుంచి రూ.17.79 లక్షలుగా ఉంది. కుషాక్‌పై రూ.30వేల వరకు ధర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment