Volkswagen Polo
-
ఇదేందయ్యా ఇది.. రూ.11 లక్షల కారు రిపేరుకు రూ.22 లక్షలు!
సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్వాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్ఇన్లో షేర్ చేశారు అనిరుధ్ గణేశ్. బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్ పనిచేయటం లేదు. దాంతో వోక్స్‌వాగ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు గణేశ్. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు గణేశ్. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్ సెంటర్ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్వాగన్ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్: హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ -
షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత?
జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ షాకిచ్చింది. ఇండియాలో ఆ కంపెనీ అందిస్తున్న కార్ల ధరలను సైలెంట్‌గా పెంచేసింది. ఇన్పుట్ కాంపోనెంట్స్ పేరుతో ఫోక్స్ వ్యాగన్ ఈ భారం మోపింది. ఫోక్స్ వ్యాగన్ కార్లకు దేశవ్యాప్తంగా సెపరేట్ కస్టమర్ బేస్ ఉంది. మార్కెట్ లీడర్‌గా ఇక్కడ ఎదగపోయినా మంచి అమ్మకాలే సాధిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి ఇండియాలో పోలో, వెంటో మోడల్స్ ఇప్పటికే రోడ్లపై పరుగులు తీస్తుండగా ఇటీవల కాంపాక్ట్ ఎస్‌యూవీగా మార్కెట్లోకి టైగన్ మోడల్ని తీసుకువచ్చింది. కాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూడు మోడళ్లపై ధరలను పెంచేసింది. ఫోక్స్‌వ్యాగన్ తాజాగా పెంచిన ధరలు నవంబరు 15 నుంచి అమల్లోకి వచ్చాయి. టైగన్ మోడల్లో ఉన్న అన్ని వేరియంట్లపై రూ. 4200ల వరకు ధరను పెంచేసింది. ప్రస్తుతం టైగన్ ధర రూ.10.54 లక్షల నుంచి రూ. 17.54 లక్షల వరకు ఉంది. ఇక వెంటో, పోలో మోడల్స్‌పై అయితే ఏకంగా రూ. 5000 ధరను పెంచింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో పోలో ధర రూ.6.32 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండగా వెంటో ధర రూ. 10 లక్షల నుంచి 14.15 లక్షల దగ్గర ఉంది. ఫోక్స్‌వ్యాగన్‌కే చెందిన సబ్సిడరీ కంపెనీ స్కోడా కంపెనీ సైతం కుషాక్ ధరని గుట్టు చప్పుడు కాకుండా పెంచేసింది. ఎక్స్‌షోరూంలో కుషాక్ ప్రారంభ ధర రూ.10.79 లక్షల నుంచి రూ.17.79 లక్షలుగా ఉంది. కుషాక్‌పై రూ.30వేల వరకు ధర పెరిగింది. చదవండి:ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..! -
ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త వేరియంట్
- ధర రూ. 5.24 లక్షల నుంచి రూ. 8.42 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ పోలో మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.5.24 లక్షల నుంచి రూ. 8.42 లక్షల(ఎక్స్ షోరూమ్, ముంబై) రేంజ్లో ఉందని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా డెరైక్టర్(ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్) మైఖేల్ మేయర్ చెప్పారు. క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అవుట్సోడ్ రియర్ వ్యూ మిర్రర్స్(ఓఆర్వీఎం) వంటి కొత్త ఫీచర్లను ఈ కొత్త పోలో వేరియంట్లో అందిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.