టైగన్ అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. మూడేళ్ళ క్రితం భారతీయ విఫణిలో అడుగెట్టిన ఈ కారు ఏకంగా 100000 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ (SIAM) గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో మాత్రమే 67140 మంది ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 32742 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది.
ఆగష్టు చివరి నాటికి టైగన్ అమ్మకాలు మొత్తం 99882 యూనిట్లు మాత్రమే. అయితే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమ్ముడైన కార్లను కలుపుకుంటే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
2023 ఆర్ధిక సంవత్సరంలో టైగన్ కారు ఎక్కువగా అమ్ముడైనట్లు (21,736 యూనిట్లు) తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 20,485 యూనిట్ల టైగన్ కార్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఎగుమతుల విషయానికి వస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 12,621యూనిట్లు ఎగుమతయ్యాయి.
ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..
టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న.. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 18.70 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఈ కారు జఫ్రీలో 5 స్టార్ రేటింగ్ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment