ఈ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే.. | Volkswagen Polo GTI prices reduced by Rs 6 lakh | Sakshi
Sakshi News home page

ఈ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే..

Published Mon, Jul 17 2017 10:48 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

Volkswagen Polo GTI prices reduced by Rs 6 lakh



న్యూఢిల్లీ :జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌ వ్యాగన్‌ తన  రీసెంట్‌  హ్యాచ్‌బ్యాక్‌ ధరను  భారీగా తగ్గించింది. టీం-బిహెచ్‌పీ అందించిన   నివేదిక ప్రకారం  పోలో జిటిఐ ధరలపై సుమారు రూ.6లక్షల తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.

2016లో లాంచ్‌ చేసిన పోలో జిటిఐ ధర రూ 6 లక్షల మేరకు తగ్గించింది.  2016 లో  భారతదేశంలో  విడుదల  సందర‍్భంగా దీని ధరను రూ. 25.99 లక్షలతో(ఢిల్లీ ఎక్స్ షోరూం)ప్రారంభించారు. ప్రస్తుత తగ్గింపుతో ఇపుడు రూ .19,99 లక్షల (ఢిల్లీ ఎక్స్ షోరూం) ధరకే లభిస్తుంది.1.9 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ లో లభ్యంకాన్ను ఈ పోలో జీటీఐ  7.2 సెకన్లలో 0-100  వేగంతో దూసుకుపోగలదు.   గరిష్టంగా 250ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. 

అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతోపాటు డీఎస్‌జీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు అనుగుణంగా యూనిట్ 7-స్పీడ్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డబుల్‌ క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్స్ ,  ఇంటిగ్రేటెడ్  రూఫ్‌ స్పాయిలర్ ఉన్నాయి.  6 ఎయిర్‌ బ్యాగులు,  హిల్ హోల్డ్ అండ్‌ ఈఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ఇతర ఫీచర్లు దీని సొంతం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement