
కొత్త ఏడాది ప్రారంభం నుంచి పెరిగిన బంగారం ధరలు.. గత మూడు రోజులుగా స్థిరంగా ఉండి, మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. గోల్డ్ రేటు (Gold Price) రూ. 78,820కు చేరింది. ఈ కథనంలో నేటి (జనవరి 8) బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 78,820 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు రూ.100, రూ.110 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.72,400 వద్ద.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.78,970 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు స్పష్టమవుతోంది.
చైన్నైలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 72,250 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,820 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 పెరిగినట్లు తెలుస్తోంది.
వెండి ధరలు
2025 ప్రారంభంలో రూ.98,000 వద్ద ఉన్న వెండి ధర (Silver Price).. ప్రస్తుతం లక్ష రూపాయలకు చేరి స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 92,500 వద్ద ఉంది.
పెరగనున్న బంగారం కొనుగోళ్లు
విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023 - 24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్
ఇక్రా నివేదిక ప్రకారం.. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).