పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు | Today Gold And Silver Prices July 4th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

Published Thu, Jul 4 2024 11:56 AM | Last Updated on Thu, Jul 4 2024 12:53 PM

Today Gold and Silver Price 4 July 2024

జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు (జులై 4) మరింత పైకి లేచాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు గరిష్టంగా రూ.710 పెరిగింది. దీంతో బంగారం ధర మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 650 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 710 పెరిగింది.

చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగి.. రూ. 67600 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73750 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
దేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దేంతో ఈ రోజు (జులై 4) కేజీ వెండి రూ. 93000లకు చేరింది. గంట నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ. 3000 పెరిగింది. ఈ ధరలు ఇలాగె కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement