Volkswagen offers huge discounts on taigun, virtus with Sri Lanka tour - Sakshi

కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్‌.. ఆసియా కప్‌ మ్యాచ్‌లు చూసే అవకాశం!

Published Sun, Aug 13 2023 6:42 PM | Last Updated on Mon, Aug 14 2023 10:07 AM

volkswagen offers Discounts and srilanka tour asia cup - Sakshi

ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్‌లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్‌వ్యాగన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

భారీ డిస్కౌంట్లు
వోక్స్‌వ్యాగన్ తైగూన్‌ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్‌ డిస్కౌంట్‌ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌. అయితే ఈ ఆఫర్‌ 1.5 లీటర్‌ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది.  అలాగే వోక్స్‌వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్‌ డిస్కౌంట్‌ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ ఉంటుందని పేర్కొంది. తైగూన్‌ లాగే ఇది కూడా 1.5 లీటర్‌ వేరియంట్‌కే వర్తిస్తుంది.

శ్రీలంక టూర్‌
వోక్స్‌వ్యాగన్ తమ  తైగూన్‌,  వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీకి అఫీషియల్‌ పార్ట్‌నర్‌గా ఉన్న వోక్స్‌వ్యాగన్ ఆగస్ట్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్‌లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్‌ను సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement