ఫోక్స్‌వ్యాగన్, స్కోడాలతో టాటా మోటార్స్‌ జట్టు | Tata Motors signs MoU with VW, Skoda to launch products in 2019 | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్, స్కోడాలతో టాటా మోటార్స్‌ జట్టు

Published Sat, Mar 11 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

ఫోక్స్‌వ్యాగన్, స్కోడాలతో  టాటా మోటార్స్‌ జట్టు

ఫోక్స్‌వ్యాగన్, స్కోడాలతో టాటా మోటార్స్‌ జట్టు

సంయుక్తంగా ప్రొడక్టుల రూపకల్పనే లక్ష్యం
2019లో మార్కెట్‌లోకి తొలి ఉత్పత్తి!


న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన సంస్థ ‘టాటా మోటార్స్‌’ తాజాగా అదే రంగంలోని ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్, స్కోడా కంపెనీలతో దీర్ఘకాలపు వ్యూహాత్మక భాగస్వామ్యఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులోభాగంగా మూడుసంస్థలు కలిసి సంయుక్తంగా ప్రొడక్టులను రూపొందించనున్నాయి.

టాటా మోటార్స్‌ సీఎండీ గుంటర్‌ బషెక్, ఫోక్స్‌వ్యాగన్‌ ఏజీ సీఈవో మథియస్‌ ముల్లర్, స్కోడా ఆటో సీఈవో బెర్న్‌హార్డ్‌ మేయర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారని టాటా మోటార్స్‌ పేర్కొంది. భాగస్వామ్యంలో భాగంగా తొలి ఉత్పత్తిని 2019లో మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement