ఫోక్స్‌వ్యాగన్ ఎమియో కారు..
న్యూఢిల్లీ: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ఎమియోను మంగళవారం ఆవిష్కరించింది. ఈ కారును ఈ ఏడాదే మార్కెట్లోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. మరో మూడు కొత్త మోడళ్లను త్వరలో ఆవిష్కరిస్తామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డెరైక్టర్ మైఖేల్ మేయర్ చెప్పారు. పూర్తిగా భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమియో కారును రూపొందించామని పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటిదాకా 80 కోట్ల యూరోలు పెట్టుబడులు పెట్టామని తెలిపారు.
ఈ కారును పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో అందిస్తున్నామని చెప్పారు. పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్, డీజిల్ ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఉన్నాయని తెలిపారు. మారుతీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్, టాటా జెస్ట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్‌లకు ఈ కారు గట్టి పోటీనిస్తుందని వివరించారు. కాగా ఈ ఎమియో కార్ల ధరలు రూ.5.5-8.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం.