హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 115 పీఎస్ పవర్‌తో 1.0 లీటర్, 150 పీఎస్ పవర్‌తో 1.5 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ పవర్‌ట్రైయిన్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో రూపుదిద్దుకుంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్, స్కోడా స్లేవియా వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది.
మధ్య స్థాయి ప్రీమియం సెడాన్స్ విభాగంలో 12–15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ‘కొత్త ఉత్పాదన రాగానే విభాగం వృద్ధి చెందుతుంది. 2022 డిసెంబర్ నాటికి ఈ విభాగం 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. కారు నిర్మాణ శైలికి ఇప్పటికీ దేశంలో ఆదరణ ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో ఈ శైలి కార్ల వాటా 12–14 శాతం కైవసం చేసుకుంది. ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మధ్యస్థాయి సెడాన్ విభాగం గతేడాది 28 శాతం వృద్ధి చెందింది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment