హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా తాజాగా సరికొత్త టైగున్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫర్‌లో ధర ఎక్స్‌షోరూంలో రూ.10.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంది.
పెట్రోల్ ఇంజన్‌తో 1 లీటర్, 1.5 లీటర్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. ఇప్పటికే 12,200 పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో టైగున్ తొలి ఉత్పాదన. మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలో దేశంలో అన్ని బ్రాండ్లవి కలిపి ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు.
‘వినియోగదార్లకు ఎంపిక పరిమితమైంది. రెండు సంస్థలదే ఈ విభాగంలో ఆధిపత్యం. అందుకే టైగున్‌ను ప్రవేశపెట్టాం. మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలో వచ్చే ఏడాది నుంచి 10% వాటా చేజిక్కించుకోవాలన్నది మా లక్ష్యం. కొత్త విభాగాలు, కొత్త అవకాశాలపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చింది’ అన్నారు.
చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’
Comments
Please login to add a commentAdd a comment