భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతున్న కార్ల తయారీ సంస్థల్లో ఒకటి 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen). ఈ జర్మన్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే టైగన్, వర్టస్ వంటి కార్లను మంచి సంఖ్యలో విక్రయిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ ఈ మోడల్స్ మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. 2022 - 2023 మధ్యలో తయారైన బిఎస్-6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న మోడల్‌లకు కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. దీని కింద ఫోక్స్‌వ్యాగన్ కార్లను కొనాలనుకునే వారు టైగన్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.41 లక్షలు, వర్టస్ సెడాన్‌పై రూ. 1.03 లక్షల తగ్గింపు పొందవచ్చు.
2022 మోడల్ టైగన్‌లో మీరు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి రూ. 65,000 నుంచి రూ. 1.41 లక్షల వరకు తగ్గింపులు లభిస్తాయి. ఇందులో టైగన్ టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్‌పై ఎక్కువ, కంఫర్ట్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద తక్కువ తగ్గింపు లభిస్తుంది. ఇక 2023 టైగన్ కొనుగోలుపై రూ. 91,000 బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉన్న 2023 మోడల్ టైగన్ మీద గరిష్టంగా రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
(ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..)
ఇప్పుడు వర్టస్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్‌పై రూ. 1.03 లక్షలు, 2022 ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. 2023 మోడల్ వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్‌లు రూ. 20,000 నుంచి రూ. 65,000 వరకు తగ్గింపు, అదే సమయంలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉండే మోడళ్లపై ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి రూ. 20,000 నుంచి రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది.
కంపెనీ అందించే ఈ ఆఫర్ ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక డీలర్ నుంచి డీలర్‌కు మారే అవకాశాలు ఉన్నాయి. కావున కొనుగోలుదారుడు ఫోక్స్‌వ్యాగన్ కొనేటప్పుడు ఖచ్చితమైన వివరాలను పొందటానికి సమీపంలో ఉన్న డీలర్‌ను సంప్రదించడం మంచిదని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment