అక్కడ ఫోక్స్వాగన్ కార్లను అమ్మదట!
జర్మన్ కారు తయారీదారి ఫోక్స్వాగన్కు కష్టాలు తప్పట్లేదు. కర్బన ఉద్గారాల స్కాంకు పాల్పడినందుకు గాను దక్షిణ కొరియాలో ఈ 25 నుంచి తన మోడల్స్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. డీజిల్ ఉద్గారాల టెస్టులో చీటింగ్కు పాల్పడినట్టు ఈ కారు తయారీదారు అమెరికాలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 లక్షల వాహనాల్లో ఈ అక్రమ సాప్ట్వేర్ను అమర్చినట్టు తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పును సరిదిద్దుకునే నేపథ్యంలో తన కార్లను ఫోక్స్వాగన్ రీకాల్ చేయడం, అమ్మకాలు నిలిపివేయడం చేస్తోంది.
తాజాగా దక్షిణ కొరియాలో తన మోడల్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఫోక్స్వాగన్ ప్రకటించింది. డీలర్స్, కస్టమర్ల మదిలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి ఈ స్కాంకు ప్రభావితమైన మోడల్స్ అమ్మకాలు నిలిపివేస్తున్నామని దక్షిణ కొరియా ఫోక్స్వాగన్ బిజినెస్ల అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నెలలో లేదా ఆగస్టు నెల మొదట్లో దీనిపై ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించనుంది. 32 వెహికిల్స్పై సర్టిఫికేషన్ను ఉపసంహరించుకుని, ఫోక్స్వాగన్ కార్ల అమ్మకాలకు అనుమతి ఇస్తుందో లేదో ఆ సమీక్షలో తేలిపోనుంది. తన లగ్జరీ కారు బ్రాండ్ ఆడీ, ఈ అమ్మకాల బ్యాన్లో మొదటి స్థానంలో ఉండనుంది.
ఉద్గారాల స్కాండల్తో కనెక్షన్ నేపథ్యంలో ఫోక్స్వాగన్ ఎగ్జిక్యూటివ్కు దక్షిణ కొరియా న్యాయవాదులు గత నెలే మొదటి వారెంట్ను సైతం జారీచేశారు. గ్లోబల్గా ఈ కంపెనీలకు చర్యలు సైతం రెట్టింపయ్యాయి. 16.2 బిలియన్ యూరోల జరిమానాలను కంపెనీ భరించిందని అంతకముందు వెల్లడించింది. మరో 2.2 బిలియన్ యూరోలను కంపెనీకి ఫైన్ గా భరించినట్టు కంపెనీ ఈ వారంలో ప్రకటించింది. దక్షిణ కొరియాలో ఇప్పటికే అమ్మకాలు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫోక్స్వాగన్కు ఈ చర్యలు మరింత కుంగదీయనున్నట్టు తెలుస్తోంది.ఈ ఏడాదిలో ఇప్పటికే ఫోక్స్ వాగన్ బ్రాండెడ్ కార్ల అమ్మకాలు దాదాపు 33 శాతం క్షీణించి, 12,463 వెహికిల్స్ మాత్రమే అమ్ముడుపోయినట్టు ఇండస్ట్రి అసోసియేషన్ డేటా పేర్కొంది. గతేడాది కొరియాలో టాప్ సెల్లింగ్ వెహికిల్స్లో ఈ కంపెనీనే నిలిచింది.