మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్! | Volkswagen ID 5 electric SUV with over 520 KM of range | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

Published Thu, Nov 4 2021 8:15 PM | Last Updated on Thu, Nov 4 2021 9:31 PM

Volkswagen ID 5 electric SUV with over 520 KM of range - Sakshi

ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న ఐడీ.5ను వోక్స్ వ్యాగన్ ఆవిష్కరించింది. ప్రముఖ జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారును ఐడీ.4ని ప్రేరణ తీసుకొని రూపొందించినట్లు తెలుస్తుంది. జర్మన్ కార్ ఆటో దిగ్గజం పేర్కొన్నట్లుగా వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్, జీటిఎక్స్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ మూడు విభిన్న పవర్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. డిజైన్ పరంగా కొత్త వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ఐడి మోడల్స్ సిగ్నేచర్ స్టైలింగ్ కలిగి ఉంది. 

ఈ కారు 77 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ వేరియెంట్లు రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తాయి. ఐడీ 5 ప్రో 171 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 10.4 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రో పెర్ఫార్మెన్స్ పవర్ అవుట్ పుట్ 201 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఇది 8.4 సెకన్లలో గంటకు 0-96 కిలోమీటర్లవేగాన్ని వేగవంతం చేయగలదు. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ రెండూ గంటకు 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కలిగి ఉంటాయి. ప్రో పెర్ఫార్మెన్స్ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు వెల్లగలదని సంస్థ పేర్కొంది.

ఇక వోక్స్ వ్యాగన్ ఐడీ 5 జీటీఎక్స్ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల డ్యూయల్ మోటార్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 295 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 6.3 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు వెల్లగలదని సంస్థ పేర్కొంది. వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ఈవీ ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇది 2022లో ఎప్పుడైనా యూరోపియన్ మార్కెట్లలో అమ్మకానికి వస్తుందని సమాచారం. మనదేశంలోకి తీసుకోవస్తారు అనే విషయంలో స్పష్టత లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement