
టాటా , ఫోక్స్‌వ్యాగన్ మధ్య విభేదాలు
కొత్త వాహనాన్ని అభివృద్ధి చేసే విషయంలో జట్టు కట్టిన టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి.
న్యూఢిల్లీ: కొత్త వాహనాన్ని అభివృద్ధి చేసే విషయంలో జట్టు కట్టిన టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ప్లాట్‌ఫాం వినియోగం, వ్యాపారపరమైన లాభదాయకత వంటి అంశాలపై సందేహాలు తలెత్తడమే ఇందుకు కారణం. సంయుక్తంగా వాహనాలను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు ఈ ఏడాది మార్చిలో ప్రకటించాయి.
ఇందులో భాగంగా తొలి వాహనం 2019లో మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఎకానమీ సెగ్మెంట్‌కి చెందిన ఈ కారుపై ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ తరఫున స్కోడా ఆటో పనిచేయనుంది. టాటా మోటార్స్‌కి చెందిన అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ ప్లాట్‌ఫాంపై ఫోక్స్‌వ్యాగన్ టెక్నాలజీ ఉపయోగించి వర్ధమాన మార్కెట్ల కోసం కార్లను తయారు చేయాలని భావించారు. అయితే, వ్యాపారపరంగా ముందు అనుకున్నంతగా ఇది అంత ఆకర్షణీయ ఒప్పందం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.