స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్ | New 2016 Skoda Superb launched at Rs 22.68 lakhs | Sakshi
Sakshi News home page

స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్

Published Wed, Feb 24 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్

స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్

ధరలు రూ.22.68 లక్షల నుంచి రూ.29.36 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ప్రీమియం సెడాన్ ‘సూపర్బ్’లో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ థర్డ్ జనరేషన్ స్కోడా సూపర్బ్‌ను 1.8 లీటర్ పెట్రోల్, 2 లీటర్ల డీజిల్ ఇంజిన్లతో రూపొం దించామని స్కోడా ఆటో ఇండియా సీఎండీ సుధీర్‌రావు చెప్పారు.  పెట్రోల్ వేరియంట్ కార్ల ధరలు రూ.22.68 లక్షలు,  రూ.23.91 లక్షలు, రూ.26.89 లక్షలని, అలాగే డీజిల్ వేరియంట్ కార్ల ధరలు రూ.26.39 లక్షలు, రూ.29.36 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై)  పేర్కొన్నారు. మైలేజీ 14-18 కి.మీ. వస్తుందని పేర్కొన్నారు. డ్యుయల్-జోన్ ఏసీ, పార్కింగ్ సెన్సర్లు, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో అడ్జెస్ట్ చేసుకోగలిగే సీట్లు, తదితర ఫీచర్లున్నాయని ఆయన తెలిపారు. కాగా ఈ థర్డ్ జనరేషన్ స్కోడా సూపర్బ్ కారు-టయోటా కామ్రి, మెర్సిడెస్ బెంజ్ సీఎల్‌ఏ, ఆడి ఏ 3 కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement