Superb
-
పేదవాడి కడుపు నింపుతున్న దేవుడు సీఎం జగన్
-
స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్
ధరలు రూ.22.68 లక్షల నుంచి రూ.29.36 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ప్రీమియం సెడాన్ ‘సూపర్బ్’లో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ థర్డ్ జనరేషన్ స్కోడా సూపర్బ్‌ను 1.8 లీటర్ పెట్రోల్, 2 లీటర్ల డీజిల్ ఇంజిన్లతో రూపొం దించామని స్కోడా ఆటో ఇండియా సీఎండీ సుధీర్‌రావు చెప్పారు. పెట్రోల్ వేరియంట్ కార్ల ధరలు రూ.22.68 లక్షలు, రూ.23.91 లక్షలు, రూ.26.89 లక్షలని, అలాగే డీజిల్ వేరియంట్ కార్ల ధరలు రూ.26.39 లక్షలు, రూ.29.36 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై) పేర్కొన్నారు. మైలేజీ 14-18 కి.మీ. వస్తుందని పేర్కొన్నారు. డ్యుయల్-జోన్ ఏసీ, పార్కింగ్ సెన్సర్లు, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో అడ్జెస్ట్ చేసుకోగలిగే సీట్లు, తదితర ఫీచర్లున్నాయని ఆయన తెలిపారు. కాగా ఈ థర్డ్ జనరేషన్ స్కోడా సూపర్బ్ కారు-టయోటా కామ్రి, మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ, ఆడి ఏ 3 కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
హర్షాలికి హేట్సాఫ్: రాజమౌళి
హైదరాబాద్ : విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న 'బజరంగి భాయిజాన్' చిత్ర కథ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. బజరంగి భాయిజాన్ చిత్ర యూనిట్ అద్భుతంగా పని చేసిందని, ఆ చిత్రంలో సల్మాన్ పాత్ర, స్టార్ ఇమేజ్ కంటే పెద్దగా ఉందని, ఇక చిన్నారి హర్షాలి నటన అద్భుతమని, ఆమెకు సెల్యూట్ చేస్తున్నానంటూ ఆయన ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. కాగా బజరంగి భాయిజాన్ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే. మరోవైపు వసూళ్లలోనూ ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. Back seat and let the story be the driver. I salute @BeingSalmanKhan and little harshaali is a show stealer.. — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 Bajrangi proves that salman the human being is bigger than salmankhan the star. It takes oodles of selfconfidence for an actor to take a — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 What struck me most in the film is the utmost sincerity of the unit to keep the story above everyone else..hats off — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 Bajrangi Bhaijaan with the “mace of a story” close to our hearts.. pic.twitter.com/HU5U5iUe1E — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 -
స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్కోడా కంపెనీ ప్రీమియమ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ సూపర్బ్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ కారు ధరలు రూ.18.87 లక్షల నుంచి రూ.25.2 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని స్కోడా ఆటో ఇండియా సీఎండీ సుధీర్ రావు తెలిపారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని, హ్యుందాయ్ సొనాటా, టయోటా కామ్రి, హోండా అకార్డ్, ఫోక్స్‌వ్యాగన్ పసంట్లకు ఈ సూపర్బ్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకతలు..: సీ షేపు టెయిల్ ల్యాంప్‌లు, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, 6-సీడీ ఛేంజర్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఓవీఆర్ఎంలు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆరు స్పీకర్లతో కూడిన టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, విశాలమైన క్యాబిన్ స్పేస్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్(డీజిల్ వేరియంట్లో ఆటోమాటిక్ వేరియంట్ కూడా), డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడీలు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ తదితర ప్రత్యేకతలున్నాయి. ఫాబియాకు టాటా... ఫాబియా కార్ల ఉత్పత్తిని నిలిపేశామని, కానీ విక్రయాలను కొనసాగిస్తున్నామని సుధీర్ రావు వివరించారు. పుణేలో ఉన్న విక్రయానంతర సర్వీసుల కార్యాలయాన్ని మూసేశామని తెలిపారు. అయితే పూర్తిగా చిన్న కార్ల సెగ్మెంట్ నుంచి వైదొలగలేదని, మళ్లీ ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తామని వివరించారు.