ఇపుడు స్కోడా వంతు | Skoda recalls 539 units of Octavia sedan in India | Sakshi
Sakshi News home page

ఇపుడు స్కోడా వంతు

Published Tue, Aug 16 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

ఇపుడు స్కోడా వంతు

ఇపుడు స్కోడా వంతు

న్యూఢిల్లీ:  చెక్ కార్ మేకర్  స్కోడా   ఇండియాలో దాదాపు 5 వందల కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ ఆక్టావియా  మోడల్   539 యూనిట్లను  వెనక్కి తీసుకోనుంది. వెనుక రెండు డోర్లలో తెలెత్తిన  లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రియర్ డోర్ల్  చైల్డ్  లాక్ లోపాన్ని  పరిష్కరించడానికి  వీలుగా నవంబర్ 2015,  ఏప్రిల్ 2016 మధ్య    ఉత్పత్తయిన ఆక్టావియా  సెడాన్  539 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు  స్కోడా  ఇండియా యూనిట్  ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వెనుక తలుపులు మాన్యువల్ పిల్లల లాక్  తనిఖీ  కోసం ఆయా వినియోగదారులను  తమ డీలర్లకు సంప్రదిస్తారని తెలిపింది.

ఈ  తనిఖీకి  12 నిమిషాలు సరిపోతుందని,  ఒక వేళ రీప్లేస్ చేయాల్సివ స్తే.. 45 నిమిషాల్లో ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది.  ర్యాపిడ్, ఎటి ఆక్టావియా, సూపర్బ్ మోడల్ కార్లను భారత్ లో విక్రయిస్తోంది.  ఢిల్లీ ఎక్స్  షో రూం లో వీటి 16 నుంచి 22 లక్షల మధ్య ఉంది.  కాగా దేశంలో 20 లక్షలకు పైగా వాహనాలను వివిధ కార్ల తయారీ సంస్థలు సెక్యూరిటీ కారణాల రీత్యా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement