ఇపుడు స్కోడా వంతు
న్యూఢిల్లీ: చెక్ కార్ మేకర్ స్కోడా ఇండియాలో దాదాపు 5 వందల కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ ఆక్టావియా మోడల్ 539 యూనిట్లను వెనక్కి తీసుకోనుంది. వెనుక రెండు డోర్లలో తెలెత్తిన లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రియర్ డోర్ల్ చైల్డ్ లాక్ లోపాన్ని పరిష్కరించడానికి వీలుగా నవంబర్ 2015, ఏప్రిల్ 2016 మధ్య ఉత్పత్తయిన ఆక్టావియా సెడాన్ 539 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు స్కోడా ఇండియా యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వెనుక తలుపులు మాన్యువల్ పిల్లల లాక్ తనిఖీ కోసం ఆయా వినియోగదారులను తమ డీలర్లకు సంప్రదిస్తారని తెలిపింది.
ఈ తనిఖీకి 12 నిమిషాలు సరిపోతుందని, ఒక వేళ రీప్లేస్ చేయాల్సివ స్తే.. 45 నిమిషాల్లో ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ర్యాపిడ్, ఎటి ఆక్టావియా, సూపర్బ్ మోడల్ కార్లను భారత్ లో విక్రయిస్తోంది. ఢిల్లీ ఎక్స్ షో రూం లో వీటి 16 నుంచి 22 లక్షల మధ్య ఉంది. కాగా దేశంలో 20 లక్షలకు పైగా వాహనాలను వివిధ కార్ల తయారీ సంస్థలు సెక్యూరిటీ కారణాల రీత్యా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.