Octavia sedan
-
లక్ష మార్క్ చేరేందుకు ఇరవై ఏళ్లు పట్టింది.. అయినా ఈ కారు ఇప్పటికీ తోపే
స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అనే నానుడికి అచ్చంగా సరిపోయేలా సాగింది ఇండియాలో స్కోడా ఓక్టావియా కారు ప్రస్థానం. ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. అయితే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కాలేదు. అలాగని దీనితో పాటు రిలీజైన మోడల్‌ల మాదిరి కనుమరుగైపోలేదు. అలా.. అలా.. మార్కెట్లో తన మార్క్ చూపిస్తూనే ఉంది. ఇక ఈ మోడల్ డిస్కంటిన్యూ అనుకునే టైమ్‌లో ఏదో మ్యాజిక్ చోటు చేసుకుని మళ్లీ మార్కెట్లో నిలదొక్కుకుంది. ఇలా ఎట్టకేలకు ఇండియాలో లక్ష యూనిట్ల అమ్మకాల రికార్డును స్కోడా ఓక్టావియా క్రాస్ చేసింది. ఇండియన్ మార్కెట్లో స్కోడాకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటు ఎంట్రీ లెవల్ అటు హై ఎండ్ మోడళ్లు కాకుండా లగ్జరీ ఫీచర్లను మిడ్ రేంజ్ ధరల్లో అందివ్వడం స్కోడా ప్రత్యేకత. ఎవరైనా స్కోడా కస్టమర్‌గా మారితే మళ్లీ ఆ బ్రాండ్ వదిలేందుకు ఇష్టపడరు అని చెప్పుకునేంత నమ్మకం ఉంది స్కోడాకి. అయితే బ్రాండ్ నుంచి వచ్చిన ఏ మోడల్ కూడా అమ్మకాల్లో అద్భుతాలు సాధించలేదనే చెప్పాలి. ఆలస్యంగానైనా ఓక్టావియా ఆ ఫీట్‌ను చేరుకుంది. లగ్జరీ ఫీచర్లు, సరికొత్త డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందుబాటులో ధరల్లో అందించే మోడల్‌గా ఇండియన్ మార్కెట్లోకి స్కోడా ఓక్టావియా 2001లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అమ్మకాలు సోసోగానే ఉన్నాయి. దీంతో 2010లో ఓక్టావియాను ఇండియన్ మార్కెట్లో డిస్ కంటిన్యూ చేస్తున్నట్టుగా స్కోడా ప్రకటించింది. ఓక్టావియా స్థానంలో లారాను మార్కెట్లోకి తెచ్చింది. కానీ మూడేళ్లు తిరిగే సరికి సరికొత్త జనరేషన్ పేరుతో ఓక్టావియా మళ్లీ ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు మార్కెట్లో ఉంది. ఓక్టావియా 2021లో లానెన్ అండ్ క్లెమెంట్ మోడళ్లను మార్కెట్ రిలీజ్ చేసింది. ప్రారంభ ధర రూ.25.99 లక్షలుగా ఉంది. బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తోంది. సెవన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 320 ఎన్ఎం టార్క్, 190 బీపీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా ఇరవై ఏళ్ల తర్వాత ఇండియాలో ఓక్టావియా అమ్మకాలు లక్ష యూనిట్లు దాటాయి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోతే లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది అనడానికి ఒక్టావియా ఓ ఉదాహారణగా నిలిచింది. లక్ష యూనిట్ల అమ్మకాల మార్క్‌ను ఓక్టావియా అధిగమించడం పట్ల స్కోడా ఇండియా హెడ్ జాక్ హోలిస్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: అమ్మకాల్లో బీభత్సం సృష్టిస్తున్న కారు.. కేవలం రెండేళ్లలోనే.. -
మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు
ముంబై: స్కోడా ఆటో ఇండియా తన ప్రీమియం సెడాన్ ఆక్టావియా కారు కొత్త వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త స్కోడా ఆక్టేవియా రెండు వేరియంట్ల' లో లభిస్తుంది. ఇందులో స్టైల్ వేరియంట్ ధర రూ.25.99 లక్షలుగా, లారిన్ - క్లైమెంట్ వేరియంట్ ధర రూ.28.99 లక్షలుగా ఉంది. నాలుగో తరానికి చెందిన ఈ కారు రెండు 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 190 పీఎస్ శక్తిని ఇస్తుంది. లీటరుకు 15.81 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులను అమర్చారు. అలాగే ఏబీఎస్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రల్ (ఈఎస్సీ), ఈబీడీ, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అత్యవసర వేళలో ఉపయోగపడే ‘‘మైస్కోడా కనెక్ట్’’ అనే ఇన్‌బిల్ట్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. దేశవ్యాప్తంగా డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. పాత కారుతో పోల్చితే సైజ్‌లో కొంచెం పెద్దదిగా డిజైన్ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హారిజంటల్ ఫాగ్‌ల్యాంప్స్ ఇవ్వగా వెనుక వైపు టైల్‌ల్యాంప్ డిజైన్లోనూ మార్పులు చేశారు. చదవండి: కోవిడ్-19 పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్ -
ఇపుడు స్కోడా వంతు
న్యూఢిల్లీ: చెక్ కార్ మేకర్ స్కోడా ఇండియాలో దాదాపు 5 వందల కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ ఆక్టావియా మోడల్ 539 యూనిట్లను వెనక్కి తీసుకోనుంది. వెనుక రెండు డోర్లలో తెలెత్తిన లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రియర్ డోర్ల్ చైల్డ్ లాక్ లోపాన్ని పరిష్కరించడానికి వీలుగా నవంబర్ 2015, ఏప్రిల్ 2016 మధ్య ఉత్పత్తయిన ఆక్టావియా సెడాన్ 539 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు స్కోడా ఇండియా యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వెనుక తలుపులు మాన్యువల్ పిల్లల లాక్ తనిఖీ కోసం ఆయా వినియోగదారులను తమ డీలర్లకు సంప్రదిస్తారని తెలిపింది. ఈ తనిఖీకి 12 నిమిషాలు సరిపోతుందని, ఒక వేళ రీప్లేస్ చేయాల్సివ స్తే.. 45 నిమిషాల్లో ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ర్యాపిడ్, ఎటి ఆక్టావియా, సూపర్బ్ మోడల్ కార్లను భారత్ లో విక్రయిస్తోంది. ఢిల్లీ ఎక్స్ షో రూం లో వీటి 16 నుంచి 22 లక్షల మధ్య ఉంది. కాగా దేశంలో 20 లక్షలకు పైగా వాహనాలను వివిధ కార్ల తయారీ సంస్థలు సెక్యూరిటీ కారణాల రీత్యా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.