
స్కోడా ‘ఆక్టావియా’లో కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.15.49 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘స్కోడా’ తాజాగా తన బెస్ట్–సెల్లింగ్ సెడాన్ కారు ‘ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా దీని ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.15.49 లక్షలు. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.
పెట్రోల్ ఆప్షన్‌లో నాలుగు రకాల వేరియంట్లున్నాయి. ఇవి 1.4 లీటర్, 1.8 లీట ర్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటి ధరలు రూ.15.49 లక్షలు– 20.89 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఇక 2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కూడా నాలుగు రకాల వేరియంట్లున్నాయి. వీటి ధర 16.90 లక్షలు– రూ.22.89 లక్షల శ్రేణిలో ఉంది. కొత్త ఆక్టావియాలో హ్యాండ్స్–ఫ్రీ పార్కింగ్, ఎనిమిది సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్ తదితర ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.