
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తాజాగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) కొడియాక్‌ను ఆవిష్కరించింది. ఈ 7 సీటర్ ఎస్‌యూవీ ధరను రూ. 34,49,501గా నిర్ణయించింది. తొలి ఏడాదిలో కనీసం 1,000 కొడియాక్ ఎస్‌యూవీలను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు స్కోడా ఆటో బోర్డు సభ్యుడు క్లాస్ డైటర్ షుర్మన్ తెలిపారు. జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌లో భాగమైన స్కోడా.. ప్రస్తుతం ర్యాపిడ్, సూపర్బ్, ఆక్టావియా పేరిట మూడు రకాల ప్రీమియం సెడాన్ కార్లను భారత్‌లో విక్రయిస్తోంది.
కొత్తగా ఆవిష్కరించిన కొడియాక్ ఎస్‌యూవీ.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇసుజు ఎంయూ–ఎక్స్‌లతో పాటు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లతో పోటీపడనుందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఔరంగాబాద్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేసే ఈ కారులో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్స్, నాలుగేళ్ల వారంటీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. బుధవారం నుంచి దీనికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే నెల మొదటి వారం నుంచి డెలివరీ మొదలవుతుందని సంస్థ ఇండియా డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment