Ashutosh Dixit
-
స్కోడా నుంచి ‘కొడియాక్’ ఎస్యూవీ
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తాజాగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) కొడియాక్‌ను ఆవిష్కరించింది. ఈ 7 సీటర్ ఎస్యూవీ ధరను రూ. 34,49,501గా నిర్ణయించింది. తొలి ఏడాదిలో కనీసం 1,000 కొడియాక్ ఎస్‌యూవీలను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు స్కోడా ఆటో బోర్డు సభ్యుడు క్లాస్ డైటర్ షుర్మన్ తెలిపారు. జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌లో భాగమైన స్కోడా.. ప్రస్తుతం ర్యాపిడ్, సూపర్బ్, ఆక్టావియా పేరిట మూడు రకాల ప్రీమియం సెడాన్ కార్లను భారత్‌లో విక్రయిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన కొడియాక్ ఎస్యూవీ.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇసుజు ఎంయూ–ఎక్స్‌లతో పాటు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్లతో పోటీపడనుందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఔరంగాబాద్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేసే ఈ కారులో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్స్, నాలుగేళ్ల వారంటీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. బుధవారం నుంచి దీనికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే నెల మొదటి వారం నుంచి డెలివరీ మొదలవుతుందని సంస్థ ఇండియా డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ వెల్లడించారు. -
రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు!
♦ ఈ ఏడాదిలో 40 డీలర్షిప్స్లకు.. హైదరాబాద్‌తో మొదలు ♦ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్‌లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్‌షిప్స్‌ను ఆధునీకరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్‌తో కలసి 5,500 చదరపు అడుగుల స్కోడా ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించారు. ‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్‌తో పాటూ కొత్త మోడళ్లను సందర్శించటం సులువవుతుంది’’ అని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్‌లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ కొత్త లుక్ తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తాం’’ అని చెప్పారాయన. స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది చివరికి 20 వేలకు చేరొచ్చని అంచనా వేశారు. -
రూ. 100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు
కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్‌లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్షిప్స్లకు ఆధునీకరిస్తున్నామని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో ప్రై.లి. డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్‌తో కలిసి 5,500 చ.అ. స్కోడా ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించారు. ‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్‌తో పాటూ కొత్త మోడళ్ల ప్రదర్శన చేయటం సులువవుతుందని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్‌లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ న్యూలుక్‌ను తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తామని’’ వివరించారాయన. రూ.8.5 లక్షల నుంచి 30 లక్షల మధ్య ఉండే స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 20 వేలకు చేరుకుంటామని ధీమావ్యక్తం చేశారు.