రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు! | sakshi special interview with skoda Sales and Marketing Director Ashutosh Dixit | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు!

Published Sat, Aug 6 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు!

రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు!

ఈ ఏడాదిలో 40 డీలర్‌షిప్స్‌లకు.. హైదరాబాద్‌తో మొదలు
సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్‌లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్‌షిప్స్‌ను ఆధునీకరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్‌తో కలసి 5,500 చదరపు అడుగుల స్కోడా ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించారు.

‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్‌తో పాటూ కొత్త మోడళ్లను సందర్శించటం సులువవుతుంది’’ అని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్‌లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ కొత్త లుక్ తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తాం’’ అని చెప్పారాయన. స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది చివరికి 20 వేలకు చేరొచ్చని అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement