dealer Ships
-
Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. ఆ ప్రాంతానికి మహర్దశ
భారతీయ ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మన దేశంలో కొన్ని కంపెనీలు విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ Dao EVTech భారీ పెట్టుబడిని ప్రకటించింది. మహారాష్ట్ర పూణే సమీపంలోని చకన్లోని 'డావ్ ఈవీటెక్' (Dao EVTech) తమిళనాడులో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 షోరూమ్‌లను కలిగి ఉన్న ఈ కంపెనీ మరిన్ని షోరూమ్‌లను ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. (ఇదీ చదవండి: పది గ్రాముల బంగారం రూ. 2 లక్షలకుపైనే .. ఎక్కడంటే?) తమిళనాడులో ఇప్పటికే మధురై, పొల్లాచ్చి, కోయంబత్తూర్, తంజావూరు ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న డావ్ ఈవీటెక్ మరిన్ని డీలర్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. చెన్నైలో ప్రారభించాలనుకున్న డీలర్‌షిప్‌లు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన నగరాల్లో డీలర్‌షిప్‌లు ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమళనాడు చాలా కీలకమైన ప్రాంతం. చెన్నైలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఎక్కువ జనాభా ఉండటం వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు చాలా దోహదపడతాయని కంపెనీ చైర్మన్ డాక్టర్ మైఖేల్ లుయి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు!
♦ ఈ ఏడాదిలో 40 డీలర్షిప్స్లకు.. హైదరాబాద్‌తో మొదలు ♦ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్‌లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్‌షిప్స్‌ను ఆధునీకరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్‌తో కలసి 5,500 చదరపు అడుగుల స్కోడా ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించారు. ‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్‌తో పాటూ కొత్త మోడళ్లను సందర్శించటం సులువవుతుంది’’ అని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్‌లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ కొత్త లుక్ తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తాం’’ అని చెప్పారాయన. స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది చివరికి 20 వేలకు చేరొచ్చని అంచనా వేశారు.