
వోల్వో కొత్త కారు (ప్రతీకాత్మక చిత్రం)
న్యూ ఢిల్లీ : స్వీడిష్ కార్ల కంపెనీ వోల్వో తన కార్లన్నింటి ధరలను 5శాతం మేర పెంచనునన్నట్లు ప్రకటించింది. 2018 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచినందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 2018 బడ్జెట్‌లో కేంద్రం సీకేడీ, సీబీయూ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 5శాతం పెంచింది. దీంతో సీకేడీ దిగుమతులపై విధించే పన్ను 15 శాతం, సీబీఐ దిగుమతులపై విధించే పన్ను 25 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న వోల్వో కార్లన్ని సీకేడీ లేదా సీబీయూ విభాగానికి చెందినవే కావడంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి.
ధరలు పెరిగాయి కదాని వినియోగదారులేమీ బాధపడాల్సిన పనిలేదని, పాత ధరల్లోనే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కారును కొనుగోలు చేసుకోవచ్చని తెలిసింది. ఈ పెరిగిన ధరలు కేవలం భారత్‌లోకి దిగుమతి అయ్యే కొత్త మోడల్ కార్లకే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏ, బీఎమ్‌డబ్య్లూ, ఆడీ క్యూ3 మాదిరిగానే భారత్‌లో వోల్వో తన ఎస్‌యూవీ, యక్స్‌సీ40లను కూడా ప్రారంభించనుంది.
ఫోర్డ్, స్కోడా కూడా...
దిగుమతి సుంకం పెరిగిన నేపథ్యంలో ఫోర్డ్, స్కోడా కంపెనీలు కూడా వాటి కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. స్కోడా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా 1 శాతం నుంచి ధరలను పెంచుతోంది. ఫోర్డ్ కూడా ఎప్పటి మాదిరిగానే తన కార్ల ధరలను 4శాతం పెంచేసింది. ఈ పెంచిన ధరలు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment