
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) ‘కొడియాక్’, ప్రీమియం సెడాన్ ‘సూపర్బ్’ కార్లలో స్పెషల్ ఎడిషన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్ వెర్షన్ సూపర్బ్ (డీఎస్‌జీ) కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 25.99 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 28.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇక డీజిల్ వేరియంట్ కొడియాక్ కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 32.99 లక్షలుగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment