safety crash test
-
కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Bharat NCAP New Rules: ఆధునిక కాలంలో కార్లను కొనే చాలామంది వినియోగదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మరింత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత్ ఎన్సీఏపీ' (Bharat NCAP) అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. మన దేశంలో తయారైన వాహనాలు మరింత భద్రతను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దిగ్గజ ఆటోమొబైల్స్ సంస్థలు కూడా తమ అంగీకారం తెలిపాయి. భారత్ ఎన్సీఏపీ.. నిజానికి భారత్ ఎన్సీఏపీ అంటే 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్'. ఇది భారతదేశంలోని వాహనాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది. మన దేశంలో తయారైన వాహనాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతైన వాహనాలకు కూడా తప్పనిసరిగా భారత్ ఎన్సీఏపీ సర్టిఫికెట్ ఉండాలి. (ఇదీ చదవండి: వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!) భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ చేసింది. దీని ప్రకారం వాహనం డిజైన్, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ వంటివి తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పటికే అమలులో ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ అండ్ యూరో ఎన్సీఏపీ రెండు కూడా ఈ నియమాలనే పాటిస్తున్నాయి. (ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!) ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది అందిస్తుంది. భారత్ ఎన్సీఏపీ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నిర్వహణ సంస్థ ఏదైనా షోరూమ్ నుంచి తమకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. మొత్తం మీద రానున్న రోజుల్లో భరతదేశంలో తయారయ్యే అన్ని కార్లు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తాయని తెలుస్తోంది. -
సేఫ్టీ రేటింగ్‌లో ‘స్విఫ్ట్’ నిరాశపరిచింది
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ‘స్విఫ్ట్’ భద్రతా ప్రమాణాల పరీక్షలో నిరాశ పరిచింది. కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే ఈ కారు సాధించింది. గ్లోబల్ న్యూకార్ అసెస్మెంట్ ప్రొగ్రామ్(జీఎన్సీఏపీ), ‘‘సేఫర్ కార్స్ ఫర్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు పూర్తిగా నిరాశజనకంగా ఉన్నట్టు వాహనదారులు పెదవి విరుస్తున్నారు. జీఎన్ఏసీపీ ప్రకారం... కారు పెద్దల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను అందుకోలేకపోయిందని తెలిసింది. అంతేకాక ప్రమాద సమయంలో కారు డ్రైవర్ తల, మెడకు రక్షణ లభిస్తున్నా.. ఛాతీ, మోకాళ్లకు మాత్రం గాయాలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ వెర్షన్లో రెండు స్టాండర్డ్ డబుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా.. 4-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ లేకపోవడంతో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు తెలిపింది. పెద్దలకు, చిన్నారులకు రక్షణ విషయంలో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు పేర్కొంది. ‘భారత్‌లో విక్రయిస్తున్న కొత్త మోడల్ స్విఫ్ట్ కార్లలో రెండు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్‌లున్నాయి. భారత ప్రభుత్వపు కొత్త క్రాష్ టెస్ట్ రెగ్యులేషన్ ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే భారత్‌లో విక్రయించే స్విఫ్ట్ కార్ల కంటే యూరప్, జపాన్లలో విక్రయించే కార్లే సురక్షిత ప్రయాణం విషయంలో మెరుగైన రేటింగ్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ భారత్‌లో తన ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది’ అని జీఎన్సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ చెప్పారు. స్థానికంగా తయారు చేసే బ్రిజా మోడల్స్‌ను అత్యంత భద్రతా ప్రమాణాలతో మారుతీ సుజుకీ రూపొందిస్తోందని, ఇదే ఫార్ములాను స్విఫ్ట్‌కు అవలంభించాలని, కనీసం యూరోపియన్, జపనీస్ వెర్షన్లకు అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్లనైనా తీసుకు రావాలని జీఎన్సీఏపీ టెక్నికల్ డైరెక్టర్ అలెజాండ్రో ఫ్యూరస్ సూచించారు. -
ప్రపంచ ట్రెండ్‌తో ర్యాలీకి బ్రేక్
♦ 69 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ♦ నిఫ్టీ 20 పాయింట్లు డౌన్ ముంబై: ప్రపంచ ట్రెండ్ ప్రతికూలంగా వుండటంతో పాటు కొన్ని కార్ల మోడల్స్ సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో ఫెయిలయ్యాయన్న వార్తలతో మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్‌పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్ల క్షీణతతో 25,705 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల తగ్గుదలతో 7,870 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ముందుగానే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు తాజాగా ఏర్పడటంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. దాంతో భారత్ సూచీలు 1 శాతం వరకూ క్షీణతతో మొదలైనా, ముగింపు సమయంలో షార్ట్ కవరింగ్ ఫలితంగా కొంతవరకూ కోలుకున్నాయి. మూడేళ్లలో ఎన్నడూలేని విధంగా గత ఏప్రిల్ నెలలో అమెరికా వినియోగధరలు పెరిగినట్లు గణాంకాలు వెలువడటంతో ఫెడ్ వడ్డీ రేట్లను త్వరలోనే పెంచవచ్చన్న అంచనాలు నెలకొన్నాయని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. ఆటో షేర్లకు దెబ్బ.... ఆటో షేర్లు నష్టాలతో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఆటో సూచీ అధికంగా 1.28 శాతం నష్టపోయింది. సెలెరియా, ఎకో మోడల్స్ క్రాష్ టెస్ట్‌లో విఫలమైనట్లు సేఫ్టీ గ్రూప్ ఎన్సీఏపి ప్రకటించడంతో మారుతి సుజుకి 0.8 శాతం తగ్గింది. బజాజ్ ఆటో, మహీంద్రా, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్ షేర్లు 1-2 శాతం మధ్య తగ్గాయి. బీహెచ్ఈఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 1 శాతం వరకూ క్షీణించాయి.