ప్రతి భారతీయుడు తమకు నచ్చిన భాషలో తమను తాము ఆన్‌లైన్‌లో స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పించే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ప్రప్రధమంగా ’వాయిసెస్ ఆఫ్ ఇండియా’ నివేదికను విడుదల చేసింది. దీని ద్వారా తమ ప్లాట్‌ఫార్మ్‌పై అత్యధికంగా దేశవాసుల చర్చల్లో చోటు చేసుకున్న అంశాలను వెల్లడించింది.
ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అందించిన ప్రజల వంచనపై కవితా పదాలు అత్యధికులు ఇష్టపడ్డారు.
కోవిడ్19 సెకండ్‌వేవ్ సమయంలో ప్రజలు ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా దాతల్ని కనుగొనడానికి ఆరాటం చూపారు.
టోక్యో2020 సమ్మర్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ 2021, పారాలింపిక్స్, భారతదేశంతో పాకిస్థాన్ పోటీపడిన ప్రపంచకప్ పోటీలు అత్యంత చర్చనీయాంశమైనవిగా గణనీయమైన ఎట్రాక్షన్‌ను అందుకున్నాయి.
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, విరాట్ కోహ్లిలు అన్ని భాషలలో ఎక్కువగా ప్రస్తావించబడిన ప్రముఖులుగా అగ్రభాగంలో నిలిచారు.
పొట్టి ఫార్మాట్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ కోహ్లీ నిర్ణయానికి అభిమానుల నుంచి గట్టి మద్దతు లభించింది.
ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను విజయానికి అభిమానులు అధిక సంఖ్యలో మద్దతు ఇవ్వడంతో ఆమె ట్రెండ్ అయ్యింది. లెజెండరీ బాలీవుడ్ సూపర్ స్టార్
దిలీప్ కుమార్ మృతి పట్ల పెద్ద సంఖ్యలో ప్రజలు సంతాపం తెలిపారు.
కోవిడ్19 సెకండ్ వేవ్ సమయంలో మ్యూకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ గురించిన ఆందోళన, సూచనలు ట్రెండీగా మారాయి.
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ కూడా బాగా ట్రెండ్ అయింది.
దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ విషాద మరణంపై పెద్ద యెత్తున వెల్లువెత్తిన సానుభూతి పునీత్‌పై ప్రేమకు అద్దం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment