Upcoming Movies In December Last Week Of 2021: కరోనా కారణంగా అన్ని రంగాలతోపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది కొంచెం ఊరట లభించింది. థియేటర్లన్నీ తెరచుకోవడంతో సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమాతో మొదలైన వసూళ్ల పండుగ అల్లు అర్జున్ 'పుష్ప', నాని 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో కొనసాగుతోంది. అయితే అనేక సవాళ్లను దాటుకొని ఎండింగ్‌కు వచ్చింది 2021 సంవత్సరం. ఇక ఈ ఏడాదిలో చివరి రోజైన శుక్రవారం, కొత్త సంవత్సరంలోని మొదటి రోజైన శనివారం ప్రేక్షకులను పలకరించడానికి చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం.
1. అర్జున ఫల్గుణ
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అర్జున ఫల్గుణ'. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తేజ మర్ని దర్శకత్వం వహించారు. శ్రీ విష్ణు స్టైల్‌కు తగినట్లుగా వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర యూనిట్ తెలిపింది.
2. జెర్సీ
బాలీవుడ్ కబీర్ సింగ్ షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం జెర్సీ. తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్‌గా హిందీలో తెరకెక్కించారు. ఇందులో షాహిద్‌కు సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా డిసెంబర్ 31కు థియేటర్లలో విడుదల కానుంది.
3. 1945
దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా చిత్రం '1945'. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు సత్యశివ డైరెక్షన్ చేశాడు. రేజీనా హీరోయిన్‌గా నటించగా సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. రానా స్వాతంత్ర్య సమరయోధుడిగా నటిస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు.
4. విక్రమ్, డిసెంబర్ 31న విడుదల
5. సత్యభామ, డిసెంబర్ 31న విడుదల
6. అంతఃపురం, డిసెంబర్ 31న విడుదల
7. ఇందువదన, జనవరి 1, 2022న విడుదల
8. ఆశ ఎన్‌కౌంటర్, జనవరి 1, 2022న విడుదల
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు:
ఆహా
1. సేనాపతి, డిసెంబర్ 31
నెట్‌ఫ్లిక్స్
1. ది పొస్సెసన్ ఆఫ్ హన్నా గ్రేస్- డిసెంబరు 27
2. చోటా బీమ్: ఎస్14 -డిసెంబరు 28
3. క్రైమ్ సీన్: ది టైమ్స్ స్వ్కేర్ కిల్లర్ - డిసెంబరు 29
4. క్యూర్ ఐ: సీజన్-6- డిసెంబరు 31
5. కోబ్రా కాయ్(సీజన్-4) -డిసెంబరు 31
6. ది లాస్ట్ డాటర్- డిసెంబరు 31
అమెజాన్ ప్రైమ్ వీడియో
1. లేడీ ఆఫ్ మేనర్- డిసెంబరు 31
2. టైమ్ ఈజ్ అప్ -డిసెంబరు 31
Comments
Please login to add a commentAdd a comment