కరోనా మహమ్మారి విజృంభించకుండా కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలతో పాటు భారత ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ విధించి దీంతో చాలా వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఇలాంటి సమయంలో తమ బంధువులతో, స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోవడానికి చాలా మంది ఫేస్‌బుక్‌నే వేదికగా చేసుకుంటున్నారు. తమ భావాలు పంచుకోవడానికి ఎమోజీలను ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో లైక్ కోసం ఉపయోగించే ధమ్స్‌అప్ ఎమోజీ, హార్ట్, లాఫింగ్, షాక్, శాడ్‌నెస్, యాంగర్ ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే తమ భావాలను పంచుకోవడానికి వీలుగా ప్రస్తుతమున్న ఆరు ఎమోజీలకు తోడు మరో ఎమోజీని ఫేస్‌బుక్ మనకోసం తీసుకువచ్చింది. అదే కేర్ ఎమోజీ.
కరోనా విపత్కర పరిస్థితుల్లో మన వారికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ కేర్ ఎమోజీని ఉపయోగిస్తారు. నవ్వుతున్న ఒక ఎమోజీ హార్ట్ సింబల్‌ని హత్తుకున్నట్లుగా ఈ కేర్ ఎమోజీని రూపొందించారు. ఫేస్‌బుక్‌తో పాటు మెసేంజర్‌లో కూడా పర్పుల్ కలర్‌లో ఉండే పల్స్ హార్ట్ ఎమోజీని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేర్ ఎమోజీ ఈ రోజు నుంచి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షం కానుంది. బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఎనేబుల్ చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా ఈ ఎమోజీ వస్తుంది. అయితే బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఎనేబుల్ చేసుకొని యూజర్స్‌లు మాత్రం ఫేస్‌బుక్ తరువాతి అప్‌డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే. కొత్తగా వచ్చిన ఈ ఎమోజీ యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.అయితే కొందరు మాత్రం ఈ కేర్ ఎమోజీ వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చేటట్లు ఉందని అంటున్నారు. సాధారణంగా ప్రేమికుల రోజున ఒక టెడ్డీబేర్ హార్ట్‌ని పట్టుకున్న టాయ్‌నే ఎక్కువగా గిఫ్ట్‌గా ఇస్తుంటారు.
We’re launching new Care reactions on @facebookapp and @Messenger as a way for people to share their support with one another during this unprecedented time.
— Alexandru Voica (@alexvoica) April 17, 2020
We hope these reactions give people additional ways to show their support during the #COVID19 crisis. pic.twitter.com/HunGyK8KQw
Comments
Please login to add a commentAdd a comment