ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లలోకి కొత్త కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయి. వచ్చే ఐఓఎస్ అప్‌డేట్‌లో తీసుకురాబోతున్న వందల కొద్దీ ఎమోజీలను ఆపిల్ శుక్రవారం టీజ్ చేసింది. దీనిలో నవ్వును ఎక్కువగా వ్యక్తీకరించే ముఖాలు, లింగ-తటస్థను తెలిపేవి, ఫుడ్ టైప్స్, యానిమల్స్ వంటి పలు ఎమోజీలు కొత్తగా ఐఫోన్, ఐప్యాడ్‌లోకి ప్రవేశపెడుతోంది. ప్రేమను వ్యక్తీకరించే 'ఐ లవ్ యూ'ను తెలుపడానికి చేతితో వ్యక్తీకరించడం వంటి సింబల్‌ను తీసుకొస్తోంది. ఐఓఎస్ 11.1 పబ్లిక్ బీటా ప్రీవ్యూస్, డెవలపర్‌లో కొత్త ఎమోజీలు ఇప్పటికే వచ్చేశాయి.
త్వరలో రాబోతున్న ఐఓఎస్, మ్యాక్‌ఓఎస్, వాచ్‌ఓఎస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లకు ఇవి ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని ఆపిల్ తెలిపింది. తాజా అప్‌డేట్లలో ఎక్కువ స్కిన్ రంగులను, దేశాల జెండాలను ఆపిల్ తీసుకొస్తోంది. కేవలం ఆపిల్ మాత్రమే కాక, ఫేస్‌బుక్ కూడా కొత్త ఫ్యామిలీ ఎమోజీని విడుదల చేసింది. ఎక్కువ స్కిన్ రంగులు, ఫ్యామిలీ మేకప్‌లతో వీటిని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ కూడా తన ఎమోజీలను రీ-డిజైన్ చేసింది. టీ-రెక్స్, ఆరెంజ్ హార్ట్, వాంటింగ్ ఫేస్ వంటి కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment