న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 కోసం ఉత్కంఠగా ఎదురుచేస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2020 టోర్నీలోని ఎనిమిది టీమ్స్‌కు ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌ను ట్విట్టర్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ గురించి ట్విట్టర్‌లో చర్చ మొదలవగా.. ట్విటర్ ప్రకటనతో అభిమానులకి కొత్త అనుభూతి లభించనుంది . అయితే ఇంగ్లీష్‌తో పాట వివిధ ప్రాంతీయ భాషల్లో క్యాప్షన్‌లున్న ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌లను ట్విటర్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment