‘మోదీ హేట్స్‌ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి | Hyderabad: Revanth Reddy Tweet Modi Hates Telangana Hashtag | Sakshi
Sakshi News home page

‘మోదీ హేట్స్‌ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి

Published Thu, Feb 10 2022 4:34 AM | Last Updated on Thu, Feb 10 2022 4:28 PM

Hyderabad: Revanth Reddy Tweet Modi Hates Telangana Hashtag - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ హేట్స్‌ తెలంగాణ’ అంటూ బుధవారం ట్యాగ్‌ చేసిన ట్వీట్‌లో మోదీ ప్రసంగం రెండు విషయాలను స్పష్టం చేసిందని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని, ఇందులో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదని మోదీ చెప్పారని గుర్తుచేశారు.

తెలంగాణకు బీజేపీ చేకూర్చిన ప్రయోజనం శూన్యమని, మొదటి నుంచీ బీజేపీ తెలంగాణ పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శి స్తోందని విమర్శించారు. తెలంగాణ అమర వీరుల ఆత్మలు క్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా మోదీ వ్యాఖ్యలున్నాయని,  ఆయన తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని తన ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement