ఎంసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం ఎదురవుతోంది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌పై విద్యార్థులకు పూర్తి సమాచారం అందించడంలో అధికారులు విఫలం కావడంతో పాత విధానంలో కౌన్సెలింగ్ జరుగుతుందనుకుని చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఏయూలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. వీరిలో దూర ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా అరకొర సమాచారంతో ఏం చేయాలో తెలియక కౌన్సెలింగ్ కేంద్రం వద్దే పడిగాపులు కాశారు. తీరా ఇక్కడ కేంద్రాల వద్ద విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఏయూలో సెక్యూరిటీ సిబ్బందే విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇవ్వడం కనిపించింది. వర్సిటీ పరిశోధకులు, సహాయ ఆచార్యుల సహకారం తీసుకుని విద్యార్థులకు పూర్తి సమాచారం ఇస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
ఎంసెట్ కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
Published Wed, May 30 2018 10:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement