
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నె న్స్ ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశా రు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచటం లేదని, 2016 ఫిబ్రవరిలో వెబ్‌సైట్‌ను నిలిపేశారని తెలిపారు.
అనేక ఫిర్యాదులు, సంప్రదింపుల అనంతరం కొన్ని జీవోలను అందుబాటులోకి తెచ్చా రన్నారు. అయినా 2016లో 56%, 2017లో 42% జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంచారని, ము ఖ్యమైన జీవోలు అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇప్పటిౖMðనా అన్ని జీవోలను సంబంధిత వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.