సాక్షి, విజయవాడ: పాఠ్య పుస్తకాల విషయంలో ఏపీ విద్యాశాఖ కొత్త విధానానికి బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వెబ్‌సైట్‌లో ఫ్రీ డౌన్ లోడ్స్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వెబ్‌సైట్ నుంచి ఎవరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం నిషేధమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కేవలం 22 రోజుల వ్యవధిలో విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది.
చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే..
ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు, ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని, విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment