గణితం కష్టమా..! | sarvashiksha abhiyan creat special website for maths | Sakshi
Sakshi News home page

గణితం కష్టమా..!

Published Sat, Jan 13 2018 10:48 AM | Last Updated on Sat, Jan 13 2018 10:48 AM

sarvashiksha abhiyan creat special website for maths  - Sakshi

బద్వేలు: నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు సర్వ శిక్షాభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో నిత్యం ప్రత్యేక ప్రయోగాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కష్టమనుకునే గణితాన్ని ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివేందుకు వీలుగా ఏపీ మ్యాథ్స్‌ ఫోరం ఆ«ధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీంతో విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు విద్యార్థి ఇష్టపడి చదివేలా అవసరమైన సూచనలు పొందొచ్చు. గణితంలో వచ్చే సందేహాలు, సమస్యలను ఉపాధ్యాయులు/విద్యార్థులు ఇతరులతో పంచుకుని పరిష్కరించుకోవచ్చు.

ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు ఏటా వృత్యంతర శిక్షణలు నిర్వహిస్తుంటారు. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని తరగతి గది బోధనలో గతేడాది నుంచి డిజిటల్‌/వర్స్‌వల్‌ తరగతుల ప్రవేశాన్ని ప్రారంభించారు. దీంతో ఉపాధ్యాయునికి కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పని సరి అయింది. ఈ నేపథ్యంలో వేసవిలో రెండు రోజుల పాటు సమాచార సంబంధాల సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ)పై ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణనిచ్చారు. ఇందులో భాగంగానే గణితానికి సంబంధించి రూపొందించిన వెబ్‌సైట్‌ వినియోగంపై ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణనిచ్చారు.
దేశంలోనే తొలి ఆన్‌లైన్‌ గణిత చర్చా వేదిక
ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ గణిత భావనలపై ‘ఏపీ మ్యాథ్స్‌ ఫోరం’ పేరు మీద  వెబ్‌సైట్‌ రూపొందించింది. దీనిలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు.
వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఏటీహెచ్‌ఆర్‌జీఓఆర్‌యూఎం.కామ్‌ లాగిన్‌ అయి ఉపాధ్యాయులైతే న్యూ టీచర్, విద్యార్థులైతే న్యూ స్టూడెంట్‌ టు జాయిన్‌లో పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
విద్యార్థులు: యూజర్‌ నేమ్, పాస్‌వర్డు క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత విద్యార్థి పేరు చిరునామా, చదువుతున్న పాఠశాల వివరాలు, ఫోన్‌ నంబరు, ఈ మెయిల్‌ ఐడీ తదితర సమాచారం నమోదు చేసి, విద్యార్థి ఫొటో ఆప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ ఎంటర్‌ చేస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
ఉపాధ్యాయులు: సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేయ్యాలి. ఈ సెక్యూరిటీ కోడ్‌ కోసం 98490 45684 సెల్‌ నంబరును కాంటాక్టు చేసి కోడ్‌ తెలుసుకోవచ్చు. ఈ కోడ్‌ సహాయంతో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌ ప్రత్యేకతలు
గణిత పరిజ్ఞానంపై నిపుణులు రాసిన అనేక ఆర్టికల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో పలువురు శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, గణితంలో  సులువైన బోధనా పద్ధతులపై అనేక అర్టికల్స్‌ ఉంటాయి. ఎవరైనా రాసిన అర్టికల్స్‌ను కూడా ఆప్‌లోడ్‌ చేయవచ్చు.
గణితంలోని వివిధ పాఠ్యాంశాలకు సంబం« దించిన నిపుణులు రాసిన పుస్తకాలు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ఉన్నాయి. వేదిక్‌ మ్యాథ్స్, గణితప్రయోగాలు వంటి రచనలు ఉంటాయి.
గణిత బోధనపై తయారు చేసిన వివిధ మాడ్యూల్స్, యూట్యూబ్‌ వీడియోస్‌ ఆప్‌లోడ్‌ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైన గణిత మెటీరియల్‌ ఉంది.
విద్యార్థులు తమ సందేహాలను పోస్టు చేస్తే నిపుణులు వాటిని అన్‌లైన్లోనే నివృత్తి చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement