
‘వి ఫర్ జగన్’ వెబ్‌సైట్ ఆవిష్కరణ
వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్నారై విభాగం, బెంగళూరు ఐటీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘వి ఫర్ జగన్’ అనే వెబ్‌సైట్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్నారై విభాగం, బెంగళూరు ఐటీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘వి ఫర్ జగన్’ అనే వెబ్‌సైట్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో ఆరోగ్య, రక్తదాన శిబిరాలు, నిరుద్యోగులకు కెరీర్ గైడెన్స్, ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇతర సేవా కార్యక్రమాల వివరాలను ఉంచుతారు. www. weforjagan. comకు లాగిన్ అయ్యి పార్టీ అభిమానులు తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
దీనివల్ల విశ్వవ్యాప్తంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులందరూ పరస్పర సహకారంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూఎస్ ఎన్నారై డాక్టర్ల విభాగం కన్వీనర్ డాక్టర్ నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.