టవర్ల రేడియేషన్ తెలుసుకోవడం ఇక సులభం! | Telecom Department's Portal Enters Final Lap, Launch Soon | Sakshi
Sakshi News home page

టవర్ల రేడియేషన్ తెలుసుకోవడం ఇక సులభం!

Published Tue, Aug 16 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

టవర్ల రేడియేషన్ తెలుసుకోవడం ఇక సులభం!

టవర్ల రేడియేషన్ తెలుసుకోవడం ఇక సులభం!

న్యూఢిల్లీ: టెలికం శాఖ తరంగ్ సంచార్ పేరుతో అతి త్వరలోనే ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనుంది. దీని ద్వారా మొబైల్ కంపెనీల టవర్లు ఎంత మేర రేడియేషన్ విడుదల చేస్తుందీ తెలుసుకోవచ్చు. దేశంలోని 12.5 లక్షల బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ల (బీటీఎస్) సమాచారాన్ని టెలికం శాఖ ఈ వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. ప్రతీ టవర్‌కు సంబంధించి... అది ఏ కంపెనీకి చెందినది, 2జీ/3జీ/ 4జీ సేవల్లో దేనికి సపోర్ట్ చేస్తుంది, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫ్రీక్వెన్సీ నిబంధనలను అమలు చేసిందా? తదితర వివరాలు తెలుసుకోవచ్చని టెలికం శాఖ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ వెబ్ సైట్ పరీక్షా దశలో ఉందని, త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్టు చెప్పాయి. ‘ఫలానా బేస్ స్టేషన్ వెలువరించే రేడియేషన్ ఏ స్థాయిలో ఉన్నదీ అప్పటికే టెలికం శాఖ పరీక్షిం చి ఉంటే అభ్యర్థన మేరకు ఆ సమాచారాన్ని పొందొచ్చు. ఒకవేళ సంబంధిత ప్రాంతంలో పరి మితి దాటిపోతే... నిర్ణీత ఫీజు చెల్లించినట్టయితే టెలికం శాఖ సిబ్బంది రేడియేషన్‌ను పరీక్షించి ఆ సమాచారాన్ని కోరిన వారికి అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement