న్యూఢిల్లీ: జడ్జీల నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన నిర్ణయాలను, ఇతర సమాచారాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కొలీజియం నిర్ణయించింది. ‘ఇకపై మేము తీసుకునే నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచుతాం.
జడ్జీల పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వాలకు చేసే సిఫార్సులు, బదిలీలు, హైకోర్టులకు సీజేల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జీల పదోన్నతులు ఒక్కో దానికి సంబంధించిన విధాన ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. ఆ సమాచారమంతా అందుబాటులోకి వస్తుంది’ అని కొలీజియం పేర్కొంది. ఇందులో భాగంగా జస్టిస్ అశోక్ మీనన్, జస్టిస్ ఆని జాన్, జస్టిస్ నారాయణ పిషారదిలు కేరళ హైకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారన్న సమాచారం సైట్‌లో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment