Onlyfans CEO Amrapali Ami Gan Biodata And Intresting Details: ‘‘ప్రొఫెషనలిజానికి ఏది అడ్డు రాదు. కారాదు కూడా. లోపాలు వెతుక్కుంటూ, విమర్శలకు భయపడి కూర్చునిపోతే అక్కడే ఆగిపోతాం. కెరీర్‌లోనే కాదు.. జీవితంలోనూ ముందుకు వెళ్లలేం. అందుకే తన ఎంపికనూ గర్వంగా చాటాల’ని కోరుకుంటోంది ఆమ్రపాలి గ్యాన్. ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో దూసుకుపోతున్న ఓ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ కంపెనీకి ఆమ్రపాలి ఇప్పుడు సీఈవోగా నియమితురాలైంది. అయితే అది అడల్ట్ కంటెంట్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్ కావడం విశేషం. అందుకే ఆసక్తికరమైన చర్చకు దారితీసింది!.
ప్రతీ రంగంలోనూ ఇప్పుడు భారతీయల హవా నడుస్తోంది. టెక్ కంపెనీల నుంచి ప్రతీదాంట్లోనూ సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు రాణిస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా చేరింది 36 ఏళ్ల ఆమ్రపాలి అమీ గ్యాన్. ముంబైలో పుట్టిపెరిగింది ఆమ్రపాలి. 2020లో ఓన్లీఫ్యాన్స్‌లో చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది గ్యాన్. అయితే ఓన్లీఫ్యాన్స్ వ్యవస్థాపకుడు టిమ్ స్టోక్లే పదవి నుంచి దిగిపోవడంతో.. ఇప్పుడు(డిసెంబర్ 21 నుంచి) గ్యాన్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టింది.
ఇంతకు ముందు ఆమ్రపాలి.. కన్జూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపెనీల్లో కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా పని చేసింది. ఆపై ఆర్కడ్ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా, కన్నాబిస్ కేఫ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా, క్వెస్ట్ న్యూట్రీషియన్‌కు బ్రాండ్ కమ్యూనికేషన్స్ హెడ్‌గా, రెడ్ బుల్ మీడియా హౌజ్‌కి కూడా పని చేసింది. ఇప్పుడు ఓన్లీఫ్యాన్స్ సీఈవోగా భారీ సవాళ్లు ఆమె ముందు ఉన్నాయి. అయితే కరోనా టైంలో వెబ్‌సైట్ చందాదారుల సంఖ్య పెరగడానికి కారణం.. ఆమ్రపాలి ఇచ్చిన ఐడియాలే!. అందుకే చాలా కాన్ఫిడెంట్‌గా సవాళ్లను అధిగమిస్తానని చెబుతోందామె.
ఓన్లీఫ్యాన్స్.. లండన్ కేంద్రంగా పని చేసే ఇంటర్నెట్ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్. 2016 నుంచి ఇది కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు(ఫ్యాన్స్) అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం.. మరోవైపు వెబ్‌సైట్‌కు కమిషన్ చేరుతోంది. అయితే కరోనా టైం నుంచి ఇది ఎక్కువస్థాయిలో అడల్ట్, పోర్న్ కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా సె*వర్కర్లకు, అడల్ట్ నటులకు కాసులు కురిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్‌కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్ ఉందని యాక్సియోస్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అశ్లీల కంటెంట్‌తో దూసుకుపోతున్న ఓన్లీఫ్యాన్స్‌కు ఓ భారతీయురాలు సీఈవో కావడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment