శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడికి వ్యతిరేకంగా రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో తన ప్లాట్‌ఫామ్ భద్రతపై తప్పుడు వార్తలు, పుకార్లను అడ్డుకునేందుకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే డేటా సెక్యూరిటీపై సందేహాలను తీర్చేందుకు ఒక ట్విటర్ ఖాతాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. (టిక్‌టాక్ : ట్రంప్ మరో ట్విస్టు)
అమెరికా ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండించిన టిక్‌టాక్ ఒక వెబ్‌సైట్ (www.tiktokus.info)ను, @tiktok_comms పేరుతో ట్విటర్ అకౌంట్ ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా టిక్‌టాక్ సంబంధించిన వాస్తవ వార్తలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే సంబంధిత వార్తలకు వెంటనే స్పందించే ఉద్దేశ్యంతో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశాన్ని యూజర్లకు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. కుటుంబ సభ్యులుగా, వినియోగదారులు, క్రియేటర్స్, భాగస్వాములుగా వైట్ హౌస్ సహా మీరు ఎన్నుకున్న ప్రతినిధులకు మీ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉందని టిక్‌టాక్ ప్రకటించింది. అలాగే చైనా ప్రభుత్వంతో వ్యక్తిగత డేటాను పంచుకుందున్న ఆరోపణలను మరోసారి తీవ్రంగా ఖండించింది. చైనాలో టిక్‌టాక్ అందుబాటులో లేదు. అక్కడి ప్రభుత్వానికి అమెరికా వినియోగదారుల డేటాను ఎప్పుడూ అందించలేదు.. అందించదు అని టిక్‌టాక్ స్పష్టం చేసింది. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?)
కాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్‌టాక్ ఇటీవలి కాలంలో అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను భారీ ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో వైఫల్యం, భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. ట్రంప్ సర్కార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment