సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 18న ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు www. psc. ap. gov. in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
19న శాంపిల్ టేకర్ పరీక్ష
ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మిని్రస్టేషన్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టుల భర్తీకి చేపట్టిన పరీక్ష ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్‌టికెట్లు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచామని, అభ్యర్థులు 18వ తేదీ లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాల రీత్యా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు సర్విస్ కమిషన్ వెబ్‌సైట్ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
21, 22 తేదీల్లో ఏఈఈ పరీక్ష
వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రాత పరీక్షను ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు
Published Wed, Aug 9 2023 4:04 AM | Last Updated on Wed, Aug 9 2023 10:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment