న్యూఢిల్లీ: సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఐ) రూపొందించిన సుమారు 3000 మ్యాప్‌లను భారత ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అయితే ఈ http://soinakshe.uk.gov.in వెబ్‌సైట్ నుంచి మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒక వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి రోజుకు 3 మ్యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. ఈ మ్యాప్‌లను భారతీయులకు మాత్రమే అందుబాటులోఉంచాలన్న ఉద్దేశంతోనే ఆధార్ నంబర్ తప్పనిసరి చేశామని తెలిపారు. ఎస్‌జీఐ ఆవిర్భవించి సోమవారంతో 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశానికి సంబంధించిన మ్యాప్‌లను అధికారికంగా ఎస్‌జీఐ మాత్రమే తయారు చేస్తుంది.
ప్రభుత్వ ఆధారిత మ్యాప్‌ల వెబ్‌సైట్ ప్రారంభం
Published Tue, Apr 11 2017 9:29 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
Advertisement