న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు విలువ గతేడాదితో పోలిస్తే స్పల్పంగా పెరిగింది. పీఎం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తాజా గణాంకాల ప్రకారం.. మోదీ నికర ఆస్తులు రూ. 3,07,68,885కు పెరిగాయి. గతేడాది ఈ సంపద 2.85 కోట్లు ఉండగా.. ఏడాదిలో 22 లక్షలు పెరిగింది. ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం, మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31 నాటికి రూ 1.5 లక్షలు, చేతిలో నగదు రూ 36,000 ఉంది. ఇక ఎస్‌బీఐ గాంధీనగర్ బ్రాంచ్‌లో గత ఏడాది రూ 1.6 కోట్లుగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ 1.86 కోట్లకు పెరగడంతో మోదీ సంపద ఎగబాకింది.
చదవండి: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ
ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం.. మోదీ పేరిట ఎలాంటి వ్యక్తిగత వాహనం లేదు. ఎలాంటి ఆర్థిక సంస్థల నుంచి కూడా ఆయన రుణం తీసుకోలేదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి ఎలాంటి సంపద లేదు. అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో రూ.8,93,251, , లైఫ్ ఇన్స్‌రెన్స్ పాలసీ రూ.1,50,957, 2002లో కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్‌లో రూ. 20 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు.. మోదీకి రూ 1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.
చదవండి: పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి
ఇకగుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రెండు నెలల ముందు ప్రధాని మోదీ గాంధీనగర్ సెక్టార్ 1లో ముగ్గురు సహ యజమానులతో కలిసి 3531 చ.అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దీనిని 2002 అక్టోబర్ 225న కొనుగోలు చేయగా.. అప్పట్లో దీని ఖరీదు రూ. 1.3 లక్షలుగా ఉంది. భూమిపై రూ. 2.4 లక్షల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దీని విలువ..రూ. 1.10 కోట్లు పలుకుతోంది. అయితే 2014 ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏ కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment