శృంగారం చేయాల్సిందిగా ఇద్దరు వైద్యవిద్యార్థులను బలవంతం చేయడమే కాకుండా, వారి చర్యను వీడియో తీసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఎనిమిది మంది దుండగులను పోలీసులు అరెస్టు చేశారు.
మంగళూరు: శృంగారం చేయాల్సిందిగా ఇద్దరు వైద్యవిద్యార్థులను బలవంతం చేయడమే కాకుండా, వారి చర్యను వీడియో తీసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఎనిమిది మంది దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరు శివార్లలో డేరాలకట్ట ప్రాంతంలో డిసెంబర్ 18న జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వైద్య విద్యార్థులైన ఇద్దరు యువతీ యువకులు కారులో వెళుతుండగా, ఎనిమిది మంది దుండగులు వారిని అడ్డగించి, బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయారు.
శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేశారు. చేయకుంటే, చంపేస్తామని బెదిరించారు. యువతీ యువకుల శృంగారాన్ని వీడియో తీసి, రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకుంటే, వీడియోలోని దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. చివరకు రూ.3 లక్షలు చెల్లించేందుకు వారు అంగీకరించడంతో, డబ్బు తీసుకువచ్చేందుకు జంటలో యువతిని విడిచిపెట్టి, యువకుడిని బందీగా ఉంచుకున్నారు. ఆమె ఒక న్యాయవాది సహాయంతో జరిగిన సంఘటనపై కొనాజే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి, శనివారం 8 మంది దుండగులనూ అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు పాత నేరస్తులేనని పోలీసులు చెప్పారు